దిశ నిందితుల మృతదేహాలున్న ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు
దిశను హత్య చేసిన నలుగురు కీచకులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ ప్రజలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దిశపై హత్యాచారం చేసిన నిందితుల మృతదేహాలకు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా చేశారు.

అనంతరం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలో పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. నిందితుల గ్రామాలైన జక్లేర్, గుడిగండ్లలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
Fri, Dec 06, 2019, 01:54 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View