ఎన్ కౌంటర్ ను ఏ ఎన్జీవో కూడా వ్యతిరేకించొద్దు: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు
Advertisement
దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేయడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇంతటి ఘోర ఘటనకు పాల్పడిన నిందితులను కాల్చి చంపాల్సిందేనని అన్నారు. ఈ చర్యను దేవుడు కూడా అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు.

ఇటువంటి మృగాళ్లకు ఇది చక్కని గుణపాఠమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించినందుకే పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై ఏ ఎన్జీవో కూడా అభ్యంతరాలు తెలపకూడదని అన్నారు. ఒక వేళ వారు ఈ ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులే అవుతారని వ్యాఖ్యానించారు.
Fri, Dec 06, 2019, 01:28 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View