ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు... ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు
Advertisement
తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసపూరిత మాటలతో లోబరచుకుని, ఆపై పెళ్లికి నిరాకరిస్తున్నాడన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా, బంధువులు కల్పించుకోవడంతో దిగివచ్చిన ప్రియుడు తాళి కట్టాడు. ఆమె చికిత్స పొందుతున్న ఐసీయూనే పెళ్లి వేదికైంది.

ఈ ఘటన పూణెలో జరిగింది. నగరానికి చెందిన సూరజ్ అనే యువకుడు, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఆపై పెళ్లాడేందుకు సూరజ్ నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని పసిగట్టిన బంధువులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. సూరజ్ కు దేహశుద్ధి చేసి, ఆసుపత్రికి తరలించారు. ఆపై ఐసీయూలోనే ఆ జంట ఒకటైంది.
Fri, Dec 06, 2019, 12:59 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View