కేసీఆర్ మాటలే తూటాలయ్యాయి: మంత్రి పువ్వాడ అజయ్
Advertisement
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన, శంషాబాద్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.

ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకి చూపిస్తామన్న కేసీఆర్ మాటలే తూటాలుగా మారాయని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతిస్తుందని ఆయన అన్నారు. తాను పోలీసును కాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని, తాను పోలీసుగా ఉండి, ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొని ఉండుంటే బాగుండేదని అనిపిస్తోందని అజయ్ వ్యాఖ్యానించారు.
Fri, Dec 06, 2019, 12:47 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View