'తప్పు చేస్తే నరకాల్సింది చేతి వేలు కాదు దేవసేన.. తలా..'.. ఎన్ కౌంటర్ నేపథ్యంలో 'బాహుబలి' ప్రభాస్ సీన్ వైరల్
Advertisement
దిశపై హత్యాచారానికి  పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో బాహుబలి-2 సినిమాలోని ప్రభాస్ డైలాగును నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఈ సినిమాలో... మహిళలపై చేయి వేస్తోన్న సైన్యాధిపతి చేతి వేలును దేవసేన (అనుష్క) కట్ చేస్తుంది. అనంతరం దీనిపై మహారాజు (రానా) విచారణ చేపడతాడు. ఈ సమయంలో బాహుబలి (ప్రభాస్) వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. 'తప్పు చేశావు దేవసేనా.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తలా..' అంటూ సైన్యాధిపతి తలను నరికేస్తాడు.

దిశపై హత్యాచారానికి  పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోని ఈ సీన్ ను నెటిజన్లు బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి కఠిన శిక్షలు వేస్తేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని అంటున్నారు.
Fri, Dec 06, 2019, 12:24 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View