17 ఏళ్ల క్రితం ప్రజలు ఇలాగే ఉంటే నాకూ న్యాయం జరిగేది: నటి ప్రత్యూష తల్లి
Advertisement
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి స్పందించారు. 17 సంవత్సరాల క్రితం తన కుమార్తెను దారుణంగా హత్యాచారం చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించిన ఆమె, ఆ సమయంలో ఇంత టెక్నాలజీ, ప్రజల్లో ఇంత చైతన్యం, పోరాట పటిమ ఉండి వుంటే, తనకు కూడా న్యాయం జరిగేదని అభిప్రాయపడ్డారు.

ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకుని వచ్చి, మరోసారి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆత్యాచార నేరస్తులకు పడే శిక్షలపై చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, దిశనే ఓ చట్టం కావాలని సరోజినీ దేవి వ్యాఖ్యానించారు. పాలకులు ఇప్పటికైనా కదలాలని అన్నారు.
Fri, Dec 06, 2019, 11:55 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View