అందుకే ఆమె పేరును 'దిశ'గా మార్చిన సజ్జనార్!
Advertisement
గత నెల 27న హైదరాబాద్ శివార్లలో దారుణ హత్యాచారానికి గురైన శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం తరువాత, ఆమె పేరును 'దిశ'గా మారుస్తున్నామని, ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అనుమతి తీసుకున్నామని, ఇకపై ఆమె అసలు పేరును వెల్లడించేందుకు వీల్లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

మహిళలపై అత్యాచారాలు జరిపి, వారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించే వారికి ఎలాంటి శిక్ష విధించాలన్న విషయమై గతంలోనే అనుభవాన్ని కలిగివున్న సజ్జనార్, కావాలనే ఆమె పేరును దిశగా మార్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో, దిశ తల్లిదండ్రులకు ఎలా న్యాయం చేయాలో, సమాజానికి ఎటువంటి సందేశాన్ని పంపాలో ఆలోచించిన ఆయన, ఓ 'దిశ'ను చూపించాలనే ఈ పేరును ఎంచుకున్నారని పలువురు అంటున్నారు.

నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష అంటే, వారిని సమాజంలో లేకుండా చేయడమే. ఆ దిశగా అడుగులు వేయాలంటే ఎంతో ధైర్యం, ఆపై ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే సత్తా తప్పనిసరి. ఆ సత్తా పుష్కలంగా ఉన్న సజ్జనార్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. జరగబోయే దాన్ని ముందే ప్లాన్ చేసుకున్న ఆయన, కావాలనే బాధితురాలి పేరును మార్చారని, అత్యాచారాలకు పాల్పడాలని భావించే వారికి తమ భవిష్యత్తు ఏ 'దిశ'గా వెళుతుందో ఉదాహరణతో సహా చూపించేందుకే ఈ పని చేశారని అంటున్నారు.
Fri, Dec 06, 2019, 11:48 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View