ఎన్ కౌంటర్ ప్రదేశంలో పోలీసులపై పూల వర్షం... చిత్రాలు!
Advertisement
దిశను దారుణంగా హతమార్చిన వారిని ఎన్ కౌంటర్ చేసి చంపడాన్ని హర్షిస్తున్న ప్రజలు, పోలీసుల చర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు, పోలీసులకు జయజయధ్వానాలు పలుకుతూ, పూలవర్షం కురిపించారు. బస్తాల్లో పూలు తెచ్చి, పోలీసులపై చల్లుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు స్వీట్స్ తినిపించారు. ఈ ఎన్ కౌంటర్ తో పోలీసులంటే నమ్మకం పెరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. దిశకు న్యాయం జరిగిందని అంటున్నారు.

ఎన్ కౌంటర్ లో నిందితులు మరణించడంపై ఎవరూ బాధపడటం లేదని, ఇంత దారుణానికి ఒడిగట్టిన వారికి తగిన శిక్షే పడిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు ఘటనా స్థలి వద్ద జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Fri, Dec 06, 2019, 11:16 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View