భార్యను హత్యచేసి, పాము కాటు వల్ల మరణించిందన్న బ్యాంక్ మేనేజర్!

05-12-2019 Thu 09:30

తన భార్యను దారుణంగా హత్య చేసిన ఓ బ్యాంక్ మేనేజర్, అంతకుముందే ఓ పామును కొని తెచ్చుకుని, అది కాటేయడం వల్లే మరణించిందని డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఓ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న అమితేశ్ పటారియా, శివానీ భార్యాభర్తలు. వీరిద్దరి మధ్యా కొన్ని విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు శివానీ మృతి చెందింది. ఆమె చేతిలో పాము కోరలను ఉంచిన పటేరియా, తన భార్యను పాము కరిచిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా, గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. దీంతో పటేరియాను గట్టిగా ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. భార్య హత్యకు 11 రోజుల ముందు రాజస్థాన్‌ నుంచి ఓ నల్ల తాచుపామును రూ. 5000 పెట్టి కొన్నాడని, భార్య హత్య తరువాత పామును చంపాడని పోలీసులు తేల్చారు.

పటేరియాను అరెస్ట్ చేశామని, హత్య కేసుతో పాటు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా కేసు పెట్టామని అన్నారు. పటేరియాకు సహకరించిన ఆయన సోదరి రిచా చతుర్వేది, తండ్రి ఓం ప్రకాష్‌ పటేరియాలను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

..Read this also
ఛత్తీస్ గఢ్ పోలీసుల బస్తర్ ఫైటర్స్ యూనిట్లో 9 మంది ట్రాన్స్ జెండర్లకు చోటు
  • మావోలపై పోరులో కీలక యూనిట్
  • 2020లో బస్తర్ ఫైటర్స్ యూనిట్ ఏర్పాటు
  • ఇటీవల రిక్రూట్ మెంట్.. ట్రాన్స్ జెండర్లకూ అవకాశం
  • లింగ వివక్ష రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసుల ప్రయత్నం


..Read this also
ప్రధాని కొత్త నినాదం ఓ గిమ్మిక్కు: కాంగ్రెస్ విమర్శలు
  • నిన్న భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం
  • జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అంటూ మోదీ నినాదం
  • అన్నీ అబద్ధాలేనన్న కాంగ్రెస్

..Read this also
సూపర్ వాసుకి.. 295 వ్యాగన్లతో అతి పొడవైన రైలు నడిపిన రైల్వే.. వీడియో ఇదిగో
  • ఆరు ఇంజన్లతో నడిచే 3.5 కిలోమీటర్ల పొడవైన రైలు
  • మన దేశంలో ఇప్పటివరకు ఇదే అతి పొడవైన రైలు అని ప్రకటించిన రైల్వే
  • వీడియోను ట్విట్టర్ లో ట్వీట్ చేసిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్


More Latest News
MLC Ananthababu will get bail automatically after 90 days in remand
Amaravati Farmers Ready to start maha padayatra from september 12th
TTD Said good news to Lord Srivari devotees
CPI Narayana slams AP CM Jagan and minister Vidadala Rajini
Leopard spotted at Tirupati SV Veterinary University campus
Pawan Kalyan will visit Kadapa district on August 20
Telangana state corona update
Dadisetti Raja comments on Pawan Kalyan
Police arrests psycho killer Rambabu
Nine transgenders selected to Chhattisgarh police Bustar Fighters unit
Drushyam 3 Movie Update
Nara Lokesh sensational comments on CM Jagan
Congress party terms PM Modi new slogan gimmick
Karthikeya 2 movie success meet
Suggest new name for MonkeyPox asked WHO
..more