సిద్ధులగుట్ట మంటల్లో కాలిన మృతదేహం గుర్తింపు
01-12-2019 Sun 06:56
- రెండు రోజుల క్రితం కలకలం రేపిన ఘటన
- ధూల్‌పేటకు చెందిన కవితాబాయిగా గుర్తింపు
- గాజులు, ముక్కుపుడక, చెప్పుల ఆధారంగా గుర్తింపు

శంషాబాద్ సమీపంలోని సిద్ధులగుట్టలో మంటల్లో కాలిపోయిన మహిళను పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా, ఆమెను ధూల్‌పేటకు చెందిన కవితాబాయి (35)గా గుర్తించారు. మతిస్థిమితం లేని ఆమె శుక్రవారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో సిద్ధులగుట్ట వద్ద కలకలం రేపిన మహిళ సజీవదహనానికి చెందిన వీడియోను మహిళ భర్త సంతోష్‌కు సోదరుడు వాట్సాప్‌లో పంపాడు. అది చూసిన సంతోష్ మృతదేహానికి ఉన్న గాజులు, ముక్కుపుడక, చెప్పుల ఆధారంగా ఆమెను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఆమె కుమార్తెలు, కుటుంబ సభ్యులు కూడా మంటల్లో కాలిపోయింది కవితాబాయేనని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
ADVERTSIEMENT
More Telugu News
ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
2 hours ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
2 hours ago
