తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు: మంత్రి కేటీఆర్
Advertisement .b
తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ఐదేళ్లలో పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానంతోనే.. ఇది సాధ్యపడిందన్నారు. ఈ రోజు మంత్రి కేటీఆర్ ను సింగపూర్ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ బృందం ఆసక్తిని వెలిబుచ్చింది. కాగా, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో శిక్షణ, ఫార్మా, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజం తదితర రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతిని సాధించిందని, ఈ రంగాల్లో తెలంగాణకు సహకారం అందిస్తామని కాన్సుల్ జనరల్ ప్రతిపాదించారు.

అనంతరం కేటీఆర్ ఈ భేటీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బాన జరొంగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  కాలుష్యరహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు సింగపూర్ వంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని మంత్రి పేర్కొన్నారు. .
Tue, Nov 19, 2019, 07:15 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View