డీఎస్సీ-2008కి సంబంధించి ఉద్యోగాల భర్తీలో సమస్యలున్నాయి: మంత్రి ఆదిమూలపు సురేశ్
Advertisement
డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ ద్వారా ఎంపికైన 4657 మంది ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. డీఎస్సీ-2008కి సంబంధించి ఉద్యోగాల భర్తీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ-2008 అభ్యర్థుల అంశంలో పైలును న్యాయవిభాగానికి పంపించామని వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. మరికొన్నిరోజుల్లో టెట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు.

ఇక ఫీజుల గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఫీజుల నియంత్రణ అమలు చేయలేకపోయామని అన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.  ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల అడ్మిషన్లు కూడా కమిషన్ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేశారు. విద్యాసంస్థల ఫీజులను డిసెంబరు చివరిలోగా కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. అయితే అన్ని కాలేజీల్లో ఒకేరకమైన ఫీజులు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. త్వరలోనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
Tue, Nov 19, 2019, 06:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View