'ఆర్ఆర్ఆర్' చిత్రంపై లేటెస్ట్ అప్ డేట్
Advertisement
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్ తో, ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి తాజా అప్ డేట్ వెలువడింది. ఇప్పటివరకు ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాదు,  చిత్రబృందం నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడనుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది రేపు ప్రకటిస్తారు. ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎదుర్కొనబోయే విలన్లు ఎవరన్నది కూడా రేపు వెల్లడిస్తారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కథానాయిక విషయంలో మాత్రం రాజమౌళి ఇప్పటివరకు సస్పెన్స్ పాటిస్తూ వచ్చాడు. రేపటితో ఆ ఉత్కంఠ వీడే అవకాశాలున్నాయి.
Tue, Nov 19, 2019, 06:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View