ఇప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు అవసరం లేదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Advertisement
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో పలువురు నేతలు వున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ పదవి కోసం రెడ్డి వర్గానికి చెందిన పది మంది నాయకులు పోటీపడుతున్నారని చెప్పారు.

అయితే, ఇప్పట్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైతే మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2023లో తమ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Tue, Nov 19, 2019, 06:29 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View