అఫ్గనిస్థాన్ లో 14 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం
Advertisement
అఫ్గనిస్థాన్ లో తాలిబన్ ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ తగిలింది. నిన్నరాత్రి ఉత్తర కుందుజ్ ప్రావిన్స్ లో అఫ్గనిస్తాన్ వైమానిక దళాలు జరిపిన దాడుల్లో 14 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఓ తాలిబన్ కమాండర్ ఉన్నాడని పోలీసులు తెలిపారు. దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు వారిపై నిఘా పెట్టాయన్నారు. ఉత్తర కుందుజ్ రాష్ట్రంలో తాలిబన్ల ఉనికిని పసిగట్టే, వైమానిక దళాలు దాడికి దిగాయన్నారు. ఈ దాడిలో స్థానిక తాలిబన్ కమాండర్ అకా హమ్జా సహా అతని అనుచరులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. కాగా వైమానిక దాడికి సంబంధించి.. తమకు జరిగిన నష్టానికి సంబంధించి.. తాలిబన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదని చెప్పారు.
Tue, Nov 19, 2019, 06:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View