ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పెలా అవుతుంది?: హైకోర్టు
Advertisement
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు, రూట్ల ప్రైవేటీకరణపై మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. మోటారు వెహికిల్ యాక్ట్ సెక్షన్-67 ను అనుసరించి ప్రజా రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని స్పష్టం చేసింది. రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయరాదని ఏ చట్టమైనా చెబుతోందా? అంటూ ప్రశ్నించింది.

అయితే, ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా వెళతారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేనప్పుడు, తాము ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ జరిగిన విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Tue, Nov 19, 2019, 05:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View