అదే రాఘవేంద్రరావు ప్రత్యేకత: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "రాఘవేంద్రరావుగారికి రచయితలు అంటే ఎంతో అభిమానం. తన సినిమాకి ఏ రచయిత అయితే పనిచేస్తున్నాడో, ఆ రచయితను ఎంతో ఆత్మీయంగా చూసుకోవడం ఆయనకి అలవాటు. రచయితలు వస్తే వాళ్లకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కనుక్కునేవారు.

భోజనం దగ్గర నుంచి పారితోషికం వరకూ రచయితలు ఏ విషయంలోను ఇబ్బంది పడకుండా చూసుకునేవారు. అలాగే ప్రతి నెలా చెప్పిన సమయానికి రచయితలకి డబ్బు వెళుతుందా లేదా అని తెలుసుకునేవారు. రచయితలకి కథ .. కథనం .. మాటల విషయంలోను ఆయన ఎంతో సహకరించేవారు. అయినా ఒకటి రెండు మార్లు తప్ప ఎప్పుడూ వాటికి సంబంధించి తన పేరును వేసుకోలేదు.. అంత గొప్ప మనసు కలిగిన దర్శకుడు ఆయన" అని చెప్పుకొచ్చారు.
Tue, Nov 19, 2019, 04:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View