ఇంటర్ చదువుతున్నప్పుడు జార్జిరెడ్డి పేరు తొలిసారిగా విన్నాను!: చిరంజీవి
Advertisement .b
విద్యార్ధి నాయకుడైన జార్జి రెడ్డి .. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. అలాంటి 'జార్జి రెడ్డి' జీవితచరిత్రను జీవన్ రెడ్డి సినిమాగా రూపొందించాడు. సందీప్ మాధవ్ ప్రధానపాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ను అభినందిస్తూ చిరంజీవి మాట్లాడారు.

"1972లో నేను ఒంగోలులో ఇంటర్మీడియెట్ చదువుకునే రోజుల్లో 'జార్జి రెడ్డి' పేరు విన్నాను. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమా కారణంగా వింటున్నాను. ఈ సినిమాలోని 'అడుగు .. అడుగు' అంటూ సాగే పాటను వింటూ నేను ఉద్వేగానికి లోనయ్యాను. జార్జి రెడ్డి ఆశయం .. ఆచరణ .. విద్యార్థినాయకుడిగా ఆయన సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారని తెలుస్తోంది. చైతన్యవంతులను చేసే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి .. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
Tue, Nov 19, 2019, 04:17 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View