నేనడిగితే ఆ అబ్బాయి నిజంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడు: లక్ష్మీపార్వతి
Advertisement
తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని వ్యక్తి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యగా అనేక పరిణామాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఆమె ఇప్పుడు వైసీపీలో రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఇటీవలే లక్ష్మీపార్వతిని క్యాబినెట్ హోదా కలిగిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిగురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను కోరుకుంటే ఏ పదవి ఇచ్చేందుకైనా జగన్ సిద్ధంగా ఉన్నాడని తెలిపారు.

"నేను కోరుకోవాలే కానీ ఆ అబ్బాయి నిజంగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడు. అయితే నాకు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం. వాటికి దగ్గరగా ఉండే పదవినే కోరుకున్నాను. ఈ విషయం తెలిసి ఇంత చిన్న పదవి తీసుకుంటున్నారా ఆమె? అని అడిగారట. అంతేకాకుండా, ఆమెకు ఏది ఇష్టమైతే అది ఇవ్వండి అని చెప్పారట" అంటూ లక్ష్మీపార్వతి వెల్లడించారు.
Sun, Nov 17, 2019, 09:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View