కర్నూలులో తహసీల్దార్ ముందే తన్నుకున్న వీఆర్వోలు!
Advertisement
కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు బాహాబాహాకి దిగిన ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తహసీల్దార్ కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి, కృష్ణదేవరాయ అనే ఇద్దరు వీఆర్వోలు ముష్టి యుద్ధానికి దిగారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తులైన ఇరువురు తహసీల్దార్ కళ్లముందే కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు  వీఆర్వోలకు గాయాలయ్యాయి. వేణుగోపాల్ రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికాడు. కృష్ణదేవరాయ జోహరాపురం వీఆర్వోగా పనిచేస్తుండగా, వేణుగోపాల్ రెడ్డి సుంకేసుల వీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరికి రాజీ కుదిర్చేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Sun, Nov 17, 2019, 05:13 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View