తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

13-11-2019 Wed 07:13
advertisement

తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోలో నరేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఉదయం పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement