ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నెం.1 స్థానాల్లో కోహ్లీ, బుమ్రా!
Advertisement
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో భారత క్రికెటర్లు కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు నెంబర్ వన్లుగా నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 895 పాయింట్లతో నెంబర్ వన్ గా కొనసాగుతుండగా, బౌలింగ్ విభాగంలో బుమ్రా అగ్ర స్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఈ ఏడాది అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న రోహిత్ శర్మ 863 పాయింట్లతో రెండో స్థానం పొందాడు. మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజం కొనసాగుతున్నాడు.

బౌలింగ్ విభాగంలో బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆఫ్గన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహమాన్ ఒక స్థానం మెరుగుపడి 707 పాయింట్ లతో మూడో స్థానంలో నిలిచాడు. సఫారీ బౌలర్ ఒక స్థానం కిందికి దిగజారి 694 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఆల్ రౌండర్ల విభాగంలో.. భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్‌ 319 పాయింట్లతో నెం.1 ర్యాంకును సొంతం చేసుకోగా, రెండో స్థానంలో ఆఫ్గన్ ఆటగాడు మహ్మద్ నబీ నిలిచాడు. జట్ల పరంగా చూస్తే ఇంగ్లండ్ అగ్ర స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలున్నాయి.
Tue, Nov 12, 2019, 09:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View