నేడు ఆ కలల సౌధం నిలువునా కూలిపోయింది: చంద్రబాబు
Advertisement
అమరావతి అభివృద్ధి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సింగపూర్ ప్రభుత్వం విరమించుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రభుత్వ నిర్ణయంతో కలల సౌధం కూలిపోయిందని, అమరావతి ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశ ఆవిరైపోయిందని వ్యాఖ్యానించారు. "సింగపూర్ ప్రభుత్వం ఆనాడు మాతో అమరావతి నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సరికొత్త ఆశలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొంగిపోయింది. కానీ నేడు కల చెదిరింది. పెట్టుబడులు వెళ్లిపోయాయి, నమ్మకం మంటగలిసింది. వినాశనం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోంది" అంటూ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశారు.
Tue, Nov 12, 2019, 09:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View