ముహూర్తం వేళ నాగిని డ్యాన్స్ చేసిన వరుడు... ఇలాంటివాడ్ని పెళ్లి చేసుకోనన్న వధువు
Advertisement
ఉత్తరప్రదేశ్ లో ఓ పెళ్లి సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. రాయ్ బరేలీ జిల్లాలోని లాఖిమ్ పూర్ కు చెందిన అబ్బాయికి, షాజన్ పూర్ కు చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. అయితే, ముహూర్తం సమయానికి పెళ్లికొడుకు తన స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా నాగిని డ్యాన్స్ చేశాడు. పెళ్లిదుస్తుల్లోనే రెచ్చిపోయి మరీ నర్తించాడు. ఇదంతా చూస్తున్న పెళ్లికూతురు ఎబ్బెట్టుగా ఫీలైంది. వీడూ, వీడి పాము డ్యాన్సు! అని అసహ్యించుకుంది. అంతేకాదు, అలాంటివాడ్ని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఈ విషయం తెలిసిన వరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు పెళ్లికూతురు గూబ గుయ్యిమనిపించాడు. ఇంకేముంది, పెళ్లి పందిరి కాస్తా రణరంగంగా మారింది. ఇరువైపుల వారు చేతికి అందిన వస్తువులతో కలబడ్డారు. ఇంతలో పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  చివరికి పెళ్లి కూతురు కుటుంబం ఇచ్చిన లాంఛనాలను తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబం అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది.
Tue, Nov 12, 2019, 08:38 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View