ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం
Advertisement
ఏపీలో పలు కమిటీల నియామకం జరిగింది. వసతులు, సౌకర్యాల కమిటీ, అటవీ, పర్యావరణ సంరక్షణ కమిటీలకు చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎస్సీ సంక్షేమ సంఘం కమిటీ చైర్మన్ గా గొల్ల బాబూరావు, ఎస్టీ సంక్షేమ సంఘం చైర్మన్ గా తెల్లం బాలరాజు, మైనారిటీ సంక్షేమ సంఘం కమిటీ చైర్మన్ గా షేక్ మహ్మద్ ముస్తఫా, స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ కమిటీ చైర్మన్ గా కళావతి, బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు.

అంతేకాకుండా, ఏడుగురు సభ్యులతో తెలుగు, సంస్కృతి అభివృద్ధి కమిటీ, ఐదుగురు సభ్యులతో ఎథిక్స్ కమిటీ, ఆరుగురు సభ్యులతో సభాహక్కుల కమిటీ ఏర్పాటు చేశారు. సభాహక్కుల కమిటీ చైర్మన్ గా దేవసాని చిన్నగోవిందరెడ్డిని నియమించారు. దాంతోపాటే, ఐదుగురు సభ్యులతో ప్రభుత్వ హామీల కమిటీ కూడా రూపుదిద్దుకుంది. ఈ కమిటీకి చైర్మన్ గా జి.తిప్పేస్వామి నియమితులయ్యారు.
Tue, Nov 12, 2019, 07:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View