దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ జెండాలే ఎగురుతున్నాయి: లక్ష్మణ్
Advertisement
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించగా, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమిపూజ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ హవా కొనసాగుతోందని, ఏ దిక్కున చూసినా బీజేపీ జెండాలే కనిపిస్తున్నాయని అన్నారు. అయోధ్య రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలోని అన్ని వర్గాలు, మతాలు, పార్టీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.

కేవలం ఆరేళ్ల వ్యవధిలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని కొనియాడారు. కేంద్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా అభివృద్ధి సాధించలేకపోయాయని విమర్శించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, అయోధ్య వివాదం వంటి దీర్ఘకాల సమస్యలను మోదీ అవలీలగా పరిష్కరించగలిగారని కితాబిచ్చారు.
Tue, Nov 12, 2019, 05:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View