'అంధాదున్' తెలుగు రీమేక్ కి దర్శకుడు ఖాయమైపోయినట్టే
Advertisement .a
నితిన్ చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టుల వరకూ వున్నాయి. వాటిలో 'అంధాదున్' ఒకటి. క్రితం ఏడాది అక్టోబర్లో విడుదలైన ఈ హిందీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ అయింది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో సుధీర్ వర్మని దర్శకుడిగా ఎంచుకున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 'స్వామిరారా'తో తన కెరియర్ ను మొదలెట్టిన సుధీర్ వర్మ, 'రణరంగం' వరకూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అంధాదున్' కథకి సుధీర్ వర్మ టేకింగ్ ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆయన పేరు ఖరారైపోయిందనే అంటున్నారు.
Tue, Nov 12, 2019, 03:48 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View