ఆ అబ్బాయి రూమ్ నిండా నా ఫొటోలే వున్నాయి.. ఆశ్చర్యపోయాను!: సీనియర్ హీరోయిన్ రాశి
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాశి మాట్లాడుతూ, షూటింగు సమయంలో తనకి ఎదురైన ఒక చిత్రమైన సంఘటనను గురించి ప్రస్తావించారు. 'కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి' సినిమా షూటింగును 'సామర్లకోట'లో ప్లాన్ చేశారు. షూటింగు కోసం అక్కడ ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంట్లోని అన్ని గదులను మాకు షూటింగు కోసం ఇచ్చారు.

ఒక గదిని ఇవ్వడానికి మాత్రం ఆ ఇంటి యజమాని కొడుకు ఒప్పుకోవడం లేదు. ఒక చిన్న సీన్ కోసం ఆ గది కూడా అవసరమవుతుంది .. ఇవ్వమని దర్శకుడు రిక్వెస్ట్ చేయడంతో, ఆ అబ్బాయి ఆ గది కీస్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. అది ఆ అబ్బాయి గది అన్నమాట. ఆ గది తలుపులు తెరిచిన యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఆ గది గోడలనిండా నా ఫొటోలు అతికించి వున్నాయి. నేను అంటే అంత అభిమానమున్న ఆ అబ్బాయి, తన ఇంటికి నేను వస్తే కనిపించకుండా వెళ్లిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.
Tue, Nov 12, 2019, 03:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View