చివరికి చైతూనే సెట్ చేసుకున్న పరశురామ్
Advertisement
దర్శకుడు పరశురామ్ తెలుగు తెరపై సరదాగా సాగే ప్రేమకథగా 'గీత గోవిందం' సినిమాను ఆవిష్కరించాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. నిర్మాతలకి ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. దాంతో ఈ దర్శకుడి సినిమా ఈ సారి స్టార్ హీరోతోనే ఉండనుందనే టాక్ వచ్చింది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పైనే ఒక సినిమా చేయనున్నాడని చెప్పుకున్నారు. కానీ అలాంటి అవకాశాలేమీ కనిపించలేదు.

ప్రభాస్ .. మహేశ్ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేయాలనే పట్టుదలతో పరశురామ్ గట్టి ప్రయత్నాలే చేశాడటగానీ కుదరలేదు. చివరికి ఈ కథకి నాయకుడిగా ఆయన చైతూనే సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమాను నిర్మిస్తున్న ఏషియన్ సునీల్, పరశురామ్ సినిమాను కూడా నిర్మించనున్నాడని అంటున్నారు. భారీ హిట్ ఇచ్చిన పరశురామ్ కి మరో ఛాన్స్ దక్కడానికి ఏడాదికి పైనే పట్టడం ఆశ్చర్యకరమే.
Tue, Nov 12, 2019, 02:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View