రసవత్తరంగా 'మహా' రాజకీయాలు... రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటున్న శివసేన
Advertisement
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై శివసేన వర్గాలు తీవ్రంగా స్పందించాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేయాలని శివసేన నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్ర ప్రతిష్టంభనపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ తో చర్చించారు.
Tue, Nov 12, 2019, 02:25 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View