కీళ్ల నొప్పులకు మాత్రలు వేసుకుంటున్నారా?.. జాగ్రత్త అంటోన్న పరిశోధకులు
Advertisement
కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కోసం చాలా మంది అలోపతీ మాత్రలు వేసుకుంటారు. అయితే, ఇలా మాత్రలు వేసుకోవడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేగాక, శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని తేల్చారు. ఈ మాత్రలు దీర్ఘకాలంలో నొప్పిపై ప్రభావం చూపవని గుర్తించారు.

దాదాపు 12,000  మందిపై అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. అత్యవసరమైతే ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. కీళ్లనొప్పులు ఉన్నవారు మాత్రల జోలికి వెళ్లడం మానేసి.. వ్యాయామం చేయడం, కాపడం పెట్టుకోవడం లాంటి వాటితో ఉపశమనం పొందొచ్చని, నొప్పి నివారణకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
Tue, Nov 12, 2019, 02:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View