పవన్ పరిచయమేగదా అనుకుని వెళ్లిన నేను ఆశ్చర్యపోయాను: సీనియర్ హీరోయిన్ రాశి
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ రాశి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. "నాలుగేళ్ల క్రితం మా పాప మొదటి పుట్టిన రోజుకి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించడానికి వెళ్లాను. అప్పుడు ఆయన షూటింగులో వున్నారు. పవన్ కల్యాణ్ గారితో నేను 'గోకులంలో సీత' సినిమా చేశాను. ఆ తరువాత ఆయనను ఎక్కడా కలవలేదు. తెలిసిన మనిషే కదా అని నేరుగా కార్లో ఆయన వున్న లొకేషన్ కి వెళ్లిపోయాను.

పవన్ కల్యాణ్ క్యారవాన్ దగ్గర చాలామంది వున్నారు. 'ఒకప్పటి పవన్ కల్యాణ్ గారు అనుకుని మీరు నేరుగా వచ్చేశారు .. ఆయనను ఇప్పుడు కలవడం కష్టమేననుకుంటాను మేడమ్ .. అపాయింట్ మెంట్ ఉండాలేమో'నని మా డ్రైవర్ అన్నాడు. సరే ఒక ప్రయత్నం చేసి చూద్దామని డ్రైవర్ తోనే కబురు చేశాను. 'అయ్యో కబురు చేయడమేంటి రమ్మని చెప్పు' అంటూ పవన్ .. డ్రైవర్ ను నా దగ్గరికి పంపించారు. నేను వెళితే ఎంతో ఆప్యాయంగా పలకరించి చాలాసేపు మాట్లాడారు. ఆయన క్రేజ్ పెరిగిందిగానీ .. ఆయన మాత్రం మారలేదనిపించింది" అని చెప్పుకొచ్చారు.
Tue, Nov 12, 2019, 01:53 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View