టీటీడీ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే... పాలకమండలి సంచలన నిర్ణయం!
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉండే అన్ని ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానిస్తూ, పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డు సమావేశం నేడు జరుగగా, ప్రత్యేక ఆహ్వానితునిగా వచ్చిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఈ ప్రతిపాదనలు చేయగా, ఆ వెంటనే పాలకమండలి దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, ప్రభుత్వ అనుమతి కోరింది.

ఇక జగన్ ప్రభుత్వం సైతం ఈ తీర్మానానికి ఆమోదం పలికితే, ఇకపై వెలువడే ఉద్యోగాల నోటిఫికేషన్ లలో చిత్తూరు జిల్లా యువతీ యువకులకు ప్రాతినిధ్యం పెరగనుంది. టీటీడీ తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తూ, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tue, Nov 12, 2019, 12:51 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View