ప్రేమ పేరిట వేధింపులు... ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
Advertisement
తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ కూతుర్ని మాత్రం బాగా చదివించాలన్న ఉద్దేశంతో ఆమెను బంధువుల ఇంట ఉంచారు. అయితే, ఆ బాలిక ఓ యువకుడి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా పెనగలూరు మండలం గట్టువారిపల్లెలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈశ్వరయ్య, లక్ష్మీదేవి దంపతులు విదేశాల్లో ఉండగా, వారి కుమార్తె హరిత (18) రాజంపేటలో ఇంటర్ చదువుతోంది.

సమీపంలోని సిరివరం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాజంపేటలో డిగ్రీ చదువుతూ, నిత్యమూ హరిత వచ్చి వెళ్లే బస్సులోనే ప్రయాణించేవాడు. ఈ క్రమంలో హరితను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ బాలిక అంగీకరించకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న హరిత బంధువులు, సదరు యువకుడిని హెచ్చరించినా, పద్ధతి మార్చుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని వెల్లడించారు.
Tue, Nov 12, 2019, 12:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View