వెంటిలేటర్ పై లతామంగేష్కర్.. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
Advertisement
గానకోకిల లతా మంగేష్కర్ పరిస్థితి విషమంగానే ఉందని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతీత్ సందానీ మాట్లాడుతూ, న్యుమోనియాతో ఆమె బాధపడుతున్నారని చెప్పారు. ఎడమ వైపు జఠరిక (గుండె కింది గది) ఫెయిల్ అయిందని తెలిపారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను వెంటిలేటర్ పై ఉంచి, వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అయితే గత కొన్ని గంటలుగా ఆమె పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. వైద్యుల పరిశీలనలోనే మరికొన్ని రోజుల పాటు ఆమె ఉండాలని చెప్పారు.

లత వయస్సును (90 ఏళ్లు) దృష్టిలో ఉంచుకుని తాము ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని డాక్టర్ ప్రతీత్ తెలిపారు. హై డోస్ యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. నిన్న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెయ్యికి పైగా హిందీ చిత్రాల్లో వేలాది పాటలను పాడిన లతా మంగేష్కర్ ను 2001లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
Tue, Nov 12, 2019, 11:56 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View