గున్న ఏనుగును రక్షించినందుకు తొండం ఎత్తి కృతజ్ఞతలు తెలిపిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్
Advertisement .a
గున్న ఏనుగును రక్షించినందుకు అధికారులకు తొండం ఎత్తి కృతజ్ఞతలు తెలిపిన తల్లి ఏనుగు వీడియో వైరల్ అవుతోంది. ఓ అటవీ ప్రాంతంలోని ఓ గున్న ఏనుగు ఓ గుంతలో పడిపోయింది.. దాన్ని బయటకు తీసేందుకు కొన్ని ఏనుగులు ప్రయత్నించాయి. అయితే, ఈ ప్రయత్నంలో అవి విఫలమైపోగా  ఈ విషయాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే ఆ ఏనుగులు దూరంగా వెళ్లిపోయాయి.

సహాయక సిబ్బంది ప్రొక్లెయిన్‌తో గున్న ఏనుగును రక్షించారు. గున్న ఏనుగు బయటకు వచ్చి తల్లి ఏనుగును కలిసింది. మిగతా ఏనుగులు దానితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ సమయంలో గున్న ఏనుగు తల్లి ఏనుగు కాసేపు ఆగి, అటవీ అధికారులు, సిబ్బంది వైపు తిరిగి తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియరాలేదు.

Tue, Nov 12, 2019, 11:35 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View