కాంగ్రెస్ తో సమావేశం అవుతామని ఎవరు చెప్పారు?: శరద్ పవార్ అసహనం
Advertisement .a
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేనతో కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు జరిపాయి. అయితే, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నేతలతో చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీతోనూ ఈ రోజు చర్చలు జరుపుతుందని ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ తో ఎన్సీపీ సమావేశం అవుతుందని ఎవరు చెప్పారు? నాకు తెలియదు' అని అసహనం వ్యక్తం చేశారు.

కాగా, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఛాతి నొప్పితో లీలావతి ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ ఈ రోజు ఉదయం ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఆ రాష్ట్ర ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం ఇచ్చిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. ఆ పార్టీ ఇందుకు విముఖత వ్యక్తం చేయడంతో  రెండో అతిపెద్ద పార్టీ శివసేనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. విధించిన గడువులోపు ఆ పార్టీ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టకపోవడంతో ఎన్సీపీకి అవకాశం ఇచ్చారు.
Tue, Nov 12, 2019, 11:04 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View