బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి.. బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు
Advertisement .a
బంగ్లాదేశ్‌లోని కస్బా పట్టణంలోని మొండోల్‌బాగ్ స్టేషన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఢాకా-బౌండ్ ఇంటర్‌సిటీ రైలు, చిట్టగాంగ్‌కు వెళ్తోన్న లోకోమోటివ్ రైలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 58 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండడంతో వారిలో చాలా మంది బోగీల్లోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు చెప్పారు.
Tue, Nov 12, 2019, 10:46 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View