టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో కల్యాణ్ రామ్
Advertisement .a
గతంలో టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో బాలకృష్ణ చేసిన 'ఆదిత్య 369' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రయోగాత్మక చిత్రానికి సీక్వెల్ చేయాలని బాలకృష్ణ చాలాకాలం నుంచి అనుకుంటున్నారు. అయితే దాదాపుగా అదే తరహా కథలో కల్యాణ్ రామ్ చేయనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకి మల్లిడి వేణు దర్శకత్వం వహించనున్నట్టుగా సమాచారం.

500 ఏళ్లకి ముందు కథ .. ఆ తరువాత కథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఫొటో షూట్ ను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 'ఎంతమంచివాడవురా' సినిమాను పూర్తి చేసిన కల్యాణ్ రామ్, ఆ తరువాత 'గుహన్' దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. ఆ తరువాతనే మల్లిడి వేణు ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
Tue, Nov 12, 2019, 10:26 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View