భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరణ.. వాటిని చూపించి అదనపు కట్నం కోసం వేధింపులు
Advertisement
ఈ వార్త చదివాక ఇలాంటి భర్తలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతే తప్పులేదు. డబ్బుపై మోజుతో కట్టుకున్న భార్యపైనే అత్యంత హీనంగా ప్రవర్తించాడో భర్త. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఆపై దానిని ఆమెకు చూపించి అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. తీసుకురాకుంటే ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. గుంటూరులో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీనివాసరావుపేటకు చెందిన యువతికి, తాడికొండకు చెందిన యువకుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన భర్త.. దానిని ఆమెకు చూపించి బెదిరించాడు. అదనపు కట్నం తీసుకురాకుంటే దానిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. భర్త చేష్టలతో నిర్ఘాంతపోయిన భార్య నిన్న స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tue, Nov 12, 2019, 10:07 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View