హృతిక్ రోషన్ ను ఆరాధిస్తున్న భార్య... చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను విపరీతంగా ఆరాధిస్తోందని, తనను నిర్లక్ష్యం చేస్తోందన్న అనుమానాన్ని పెంచుకున్న ఓ భర్త, కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, మూడేళ్ల క్రితం వరకూ ప్రేమ జంటగా ఉన్న దినేశ్వర్, డోన్నె డోజోయో, ఇండియాలో వివాహం చేసుకుని ఆపై అమెరికాకు వెళ్లారు. క్వీన్స్ ప్రాంతంలోని ఓజోన్ రోడ్ లో ని జెమిని అల్ట్రా లాంజ్ బార్‌లో డోజోయ్ ఉద్యోగిగా పనిచేస్తోంది.

ఆమెకు హృతిక్ రోషన్ అంటే వీరాభిమానం. నిద్ర వచ్చేవరకూ హృతిక్ సినిమాలు చూసే ఆమె, ఆపై నిద్రలోనూ అతన్నే కలవరిస్తుండేది. ఈ విషయమై భర్తతో తరచూ గొడవలు పడుతుండేది. హృతిక్ రోషన్ తో భర్తను పోల్చి చూసే ఆమె, అతనిలా ఉండాలని అంటుంటే, దినేశ్వర్‌ కు ఆమె వైఖరి నచ్చేది కాదు. దీంతో భార్యను దినేశ్వర్ చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. దీనిపై ఆమె పోలీసులను కూడా ఆశ్రయించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దినేశ్వర్ ను అరెస్ట్ చేసి, జైలుకు పంపగా, ఆపై అతను విడుదలయ్యాడు. తీవ్రమైన ఆగ్రహంతో ఇంటికి వచ్చిన దినేశ్వర్, భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Tue, Nov 12, 2019, 09:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View