మెగా హీరో మూవీలో రమ్యకృష్ణ
Advertisement
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ, ప్రస్తుతం కీలకమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువ హీరోలకి తల్లిగా .. అత్తగా పవర్ఫుల్ పాత్రలను చేస్తూ మెప్పిస్తున్నారు. 'రొమాంటిక్' చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్న ఆమె, త్వరలో మెగా హీరో షూటింగులో పాల్గొనే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సెట్స్ పైకి వెళ్లనున్న ఒక సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ తో ఒక వైపున కిరణ్ కొర్రపాటి .. మరో వైపున సురేందర్ రెడ్డి సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఎవరి ప్రాజెక్టు కోసం రమ్యకృష్ణను అడుగుతున్నారనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఇప్పటి వరకూ అక్కినేని వారసులతో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రమ్యకృష్ణ, మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టే విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
Tue, Nov 12, 2019, 09:38 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View