డీకే శివకుమార్ కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Advertisement
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో నిన్న అర్ధరాత్రి ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 1వ తేదీన కూడా ఆయన అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవెల్స్ పెరగడం, చక్కెర స్థాయులు నిలకడగా లేకపోవడంతో అప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరారు. మనీలాండరింగ్ కేసులో ఆయన ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 23న ఆయన జైలు నుంచి బయటకు వచ్చి బెంగళూరు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన అలుపెరగకుండా పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.
Tue, Nov 12, 2019, 09:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View