మా నాయనమ్మకి భానుమతి .. సావిత్రి మంచి స్నేహితులు: సీనియర్ హీరోయిన్ రాశి
Advertisement
తెలుగు తెరపై అందాల కథానాయికగా రాశి తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసి, ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి రాశి .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తన కెరియర్ గురించిన విషయాలను పంచుకుంది. "నా అసలు పేరు విజయలక్ష్మి .. మా నాన్నగారిది 'చెన్నై' .. మా అమ్మగారిది 'భీమవరం'. నేను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే.

అప్పట్లో వాహిని స్టూడియో దగ్గర మా తాతగారికి ఒక షాప్ ఉండేది. అక్కడికి ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ .. సావిత్రి .. భానుమతి .. జమున చాలా తరచుగా వచ్చేవారట. చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారట. అందువలన సావిత్రిగారు .. భానుమతిగారు ఇద్దరూ మా నాయనమ్మకు మంచి స్నేహితులయ్యారు. మా నాయనమ్మ పేరు కమలమ్మ. సావిత్రి .. భానుమతిగారి ఇళ్లకి కూడా ఆమె వెళుతూ ఉండేది" అని చెప్పుకొచ్చింది.
Tue, Nov 12, 2019, 09:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View