రామ భక్తి... 27 ఏళ్ల దీక్షను విరమించనున్న ఊర్మిళా చతుర్వేది!
Advertisement
1992లో బాబ్రీ మసీదును కూల్చి వేసిన రోజు నుంచి దీక్షబూని, సాధారణ ఆహారాన్ని వదిలేసి, 27 సంవత్సరాల పాటు గడిపిన ఊర్మిళా చతుర్వేది తన దీక్షను విరమించారు. ప్రస్తుతం 81 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె, గడచిన 27 సంవత్సరాలుగా పాలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు.

అయోధ్యలో రామాలయం కట్టాలన్నదే తన కలని, దానికి మార్గం సుగమం అయ్యే వరకూ తాను దీక్ష వహిస్తానని స్పష్టం చేసిన ఆమె, ఇప్పుడు దీక్షను విరమించేందుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఊర్మిళా చతుర్వేది, దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tue, Nov 12, 2019, 08:42 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View