ప్రత్యేక దర్శనాల్లో అదనపు కోటా... తిరుమలలో నేడు, రేపు మాత్రమే!
Advertisement
నేడు, రేపు తిరుమలలో ప్రత్యేక దర్శనాల్లో అదనపు కోటాను విడుదల చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, శ్రీ వెంకటేశ్వరా మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ వద్ద అర్హులైన వారు టోకెన్లు పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

ఐదేళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులున్న భక్తులను స్వామివారి దర్శనానికి రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా లోపలికి పంపిస్తామని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఇక ఇదే నెలలో 26న వృద్ధులకు, దివ్యాంగులకు 27న మరోమారు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు.
Tue, Nov 12, 2019, 08:39 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View