ఈ పెళ్లి తనకు వద్దంటూ... ఎస్పీకి ఫోన్ చేసిన యువతి!
Advertisement
తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, ఈ వివాహం తనకు ఇష్టం లేదని, తనను కాపాడాలని కోరుతూ, ఓ యువతి అనంతపురం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసింది. ఆ వెంటనే స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ధర్మవరం, కొత్తపేటకు చెందిన 22 ఏళ్ల యువతికి వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఎస్పీకి ఫోన్ చేసిన ఆమె, పెళ్లిని ఎలాగైనా ఆపాలని కోరింది. దీంతో ధర్మవరం పోలీసులను ఎస్పీ అప్రమత్తం చేశారు. వారు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై తహసీల్దారు ఎదుట బైండోవర్ చేసి, అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయవద్దని హెచ్చరించి పంపారు. యువతిని అనంతపురంలోని ఉజ్వల హోమ్ కు పంపించారు.
Tue, Nov 12, 2019, 08:28 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View