సినీ నటి అర్చన ఇంట మొదలైన పెళ్లి సందడి.. సంగీత్‌లో ఆడిపాడిన జంట!
Advertisement .a
సినీ నటి అర్చన, పారిశ్రామికవేత్త జగదీశ్ వివాహం రేపు తెల్లవారుజామున 1:30 గంటలకు వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి జరగనున్న గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా వారితో కాలు కదిపారు. కాగా, నేడు రిసెప్షన్ జరగనుంది. సంగీత్ కార్యక్రమానికి వధూవరుల తల్లిదండ్రులతోపాటు బంధువులు, స్నేహితులు  హాజరయ్యారు.
Tue, Nov 12, 2019, 07:54 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View