సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement .a
*  ఇన్నాళ్లూ గ్లామరస్ పాత్రలలో నటిస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్న కథానాయిక నయనతార ఇప్పుడు అమ్మవారి పాత్రలో కనిపించనుంది. తమిళ నటుడు ఆర్జే బాలాజీ నటిస్తున్న 'ముక్తి అమ్మన్' అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా నటించడానికి నయనతార అంగీకరించింది.
*  'సైరా' చిత్రంతో పలు ప్రశంసలందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని వరుణ్ తేజ్ తో చేయనున్నాడు. విశేషం ఏమిటంటే, ఈ కథను ముందుగా ప్రభాస్ కు చెప్పాడట. కథ నచ్చినప్పటికీ తను ప్రస్తుతం 'జాన్' చిత్రంతో బిజీగా వుండడం వల్ల ప్రభాస్ డేట్స్ ఇవ్వలేకపోయాడని, దాంతో ఈ కథను వరుణ్ తేజ్ తో చేస్తున్నాడని అంటున్నారు.
*  ధనుశ్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్' తమిళ హిట్ చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తాడట.  
Tue, Nov 12, 2019, 07:26 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View