ఎంఎంటీఎస్-హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్ ఢీ ఘటన.. ఎంఎంటీఎస్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన
Advertisement .b
హైదరాబాద్ నగర ప్రజలకు అనువుగా ఉండేలా, అతి తక్కువ ధరకే గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో 16 ఏళ్ల క్రితం ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దంన్నర కాలంలో కొన్ని కోట్ల మందిని ఎంఎంటీఎస్ తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం రోజుకు 121 సర్వీసులు నడుస్తున్నాయి. నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2003లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు 1.60 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో, ఎంఎంటీఎస్ 16 ఏళ్ల చరిత్రలో నిన్న జరిగిన ప్రమాదమే అతి పెద్ద దుర్ఘటన అని అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న రైలు.. కర్నూలు వెళ్లడానికి సిద్ధంగా వున్న హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్‌ను 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tue, Nov 12, 2019, 06:48 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View